బ్రేకింగ్ : సిట్‌కు బండి సంజయ్ లేఖ.. ఆ విషయంలో క్లారిటీ!

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు.

Update: 2023-03-24 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. లేఖలో తాను సిట్‌ను విశ్వసించడం లేదన్నారు. సిట్‌పై నమ్మకం లేదన్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదలుచుకోలేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తనకు నమ్మకం ఉన్న సంస్థలకే సమాచారం ఇస్తానన్నారు.

తనకు సిట్ నోటీసులు అందలేదన్నారు. మీడియాలో వచ్చిన సమాచారం మేరకే తాను స్పందిస్తున్నానని బండి సంజయ్ లేఖలో తెలిపారు. 24న హాజరు కావాలని కోరినట్టు మీడియా ద్వారా తనకు తెలిసిందన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా సభకు హాజరు కావాల్సి ఉందని లేఖలో బండి పేర్కొన్నారు. అయితే టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో సిట్ బండి సంజయ్‌కి ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తమ వద్ద ఉన్న సమచారాన్ని సిట్ నోటీసుల్లో బండి సంజయ్‌ను కోరింది. 

ఇవి కూడా చదవండి: ‘సిట్’ విచారణకు బండి సంజయ్ దూరం.. కారణం ఇదే?

Tags:    

Similar News