BIG BREAKING: మరికొద్దిసేపట్లోనే కేసీఆర్‌తో కేకే భేటీ.. గులాబీ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా..?
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, గులాబీ బాస్‌కు నమ్మిన బంటు కే.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తమ రాజకీయ నిర్ణయంపై బుధవారం తన కుటుంబ సభ్యులతో కేకే భేటీ అయినట్లుగా సమాచారం. మరికొద్దిసేపట్లోనే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన రీతిలో గౌరవం దక్కిందని, తాను కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, ఇప్పుడు సొంత పార్టీ వైపు చూస్తే తప్పేముందంటూ కేకే తన సన్నిహితులతో అన్నట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు!
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2024
రాజ్య సభ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ కంచెర్ల కేశవ రావు పార్టీ వీడబోతున్నారు. కేసీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్లినట్లు సమాచారం.
ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కేశవ రావు మరియు ఆయన కూతురు మేయర్ గద్వాల… pic.twitter.com/txK9PVkxnF