అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేవైఎమ్.. ఉద్రిక్త వాతావరణం

బీజేవైఎం నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబంధించిన భూములను వేలానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలసిందే.

Update: 2025-03-18 06:14 GMT
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేవైఎమ్.. ఉద్రిక్త వాతావరణం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బీజేవైఎం (BJYM) నాయకులు అసెంబ్లీ ముట్టడికి (Assembly siege) ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  (Hyderabad Central University)కి సంబంధించిన భూములను వేలానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలసిందే. ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో పాటు ఇతర పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తో.. మంగళవారం బీజేవైఎమ్ నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే బీజేవైఎమ్ నేతల నిరసన కి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (BJP MLA Yeleti Maheshwar Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బీజేవైఎమ్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Similar News