BJP : నాడు పంటనష్టం ప్రకటించి ఎగ్గొట్టిన కేసీఆర్ సర్కార్.. బీజేపీ తీవ్ర విమర్శలు

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. పది వేలు చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-03 08:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. పది వేలు చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిహారం పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ పార్టీ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేసింది. ముంచెత్తిన వరదల్లో.. మునిగిన పంటలు పంట నష్టంపై.. నామ్ కే వస్తే పరిహారాలు అంటూ విమర్శించింది.

పంట నష్టంపై తూతూ మంత్రపు పరిహారం, 10 వేలు పరిహారం ప్రకటించి అప్పుడు కేసీఆర్ ఎగ్గొట్టాడని, అదే దారిలో రేవంత్ సర్కార్ ఉందని పేర్కొంది. కాకిలెక్కలతో రుణమాఫీని సరిపెట్టారని, రైతు భరోసా మాటలకే పరిమితమైనదని, ప్రస్తుత పరిహారం పరిస్థితి అంతేనని విమర్శలు చేసింది.

 


Similar News