కమలాపూర్ పోలీసులకు బండి సంజయ్ స్ట్రాంగ్ రిప్లై
తన ఫోన్‌ను తనకు వెతికి ఇవ్వాలని, అప్పటి వరకు తనను విచారణకు పిలవొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తన ఫోన్‌ను తనకు వెతికి ఇవ్వాలని, అప్పటి వరకు తనను విచారణకు పిలవొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్‌ను మరోసారి విచారణకు హాజరుకావాలని కమలాపూర్ పోలీసులు ఇచ్చిన 91/160 సీఆర్పీసీ నోటీసులకు ఈ మేరకు బండి రిప్లై ఇచ్చారు. కేసు తదుపరి విచారణకు సంజయ్ మొబైల్ ఫోన్ అవసరమని, విచారణకు వచ్చే సమయంలో కచ్చితంగా తన ఫోన్‌ను వెంట తీసుకురావాలని బండి సంజయ్‌ను పోలీసులు ఆదేశించారు.
కాగా, కమలాపూర్ పోలీసులు పంపిన నోటీసులపై సంజయ్ ఘాటుగా స్పందించారు. పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్న అధికారులు తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ఇరికించడం తగదని రిప్లై ఇచ్చారు. తన ఫోన్ పోయిందని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో అత్యంత అధునాతన టెక్నాలజీ పోలీస్ వ్యవస్థ వద్ద ఉందని గొప్పలు చెబుతున్న సర్కార్ తన ఫోన్‌ను ఎందుకు ట్రేస్ చేయలేకపోతోందని ప్రశ్నించారు. తన ఫోన్ తీసుకొచ్చి ఇచ్చే వరకు తనకు విచారణకు పిలవద్దని బండి కరాఖండిగా స్పష్టం చేశారు. సంబంధం లేని కేసులో పదే పదే నోటీస్ ఇస్తే లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి: సీపీపై పరువు నష్టం దావాకు సిద్ధమవుతున్న బండి సంజయ్..!