BJP: రాజన్న సొమ్ముతో రాచమర్యాదలు..! తెలంగాణ బీజేపీ సంచలన ఆరోపణలు
రాజన్న సొమ్ముతో రాచమర్యాదలు! అని బీజేపీ తెలంగాణ(BJP Telangana) సంచలన విమర్శలు(Criticisms) చేసింది.
దిశ, వెబ్ డెస్క్: రాజన్న సొమ్ముతో రాచమర్యాదలు! అని బీజేపీ తెలంగాణ(BJP Telangana) సంచలన విమర్శలు(Criticisms) చేసింది. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంపై (Vemulawada Rajarajeshwari temple) కాంగ్రెస్ నాయకుల(Congress leaders) మీద వస్తున్న ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా.. ప్రత్యేక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(Chief Minister Revanth Reddy) సహా మిగతా కాంగ్రెస్ నాయకుల భోజనాలకు 32 లక్షల బిల్లు.. అని, కొడెద్దుల అమ్మకం అనంతరం కోటి డెబ్బై లక్షల ఖర్చుతో దర్శనం.. అని వ్యాఖ్యానించింది. దీనిపై వేములవాడ రాజన్నకు భక్తులు ఇచ్చిన కానుకలతో.. కాంగ్రెస్ నాయకులకు రాజ భోజ్యం! అని, మొన్నటికి మొన్న రాజన్న గుడిలోని కోడెద్దులను అమ్ముకున్నారని, ఇప్పుడు రేవంత్ & కో విందు విహారాలకు రాజన్న హుండీనే కొల్లగొడుతున్నారని ఆరోపించింది.