Etala Rajender: మేడ్చల్ మెట్రోపై క్రెడిట్ గేమ్ ఆపండి.. ఎంపీ ఈటల సెన్సేషనల్ కామెంట్స్

మేడ్చల్ మెట్రో (Medchal Metro)పై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు క్రేడిట్ గేమ్ ఆపాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-03 02:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మెట్రో (Medchal Metro)పై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు క్రేడిట్ గేమ్ ఆపాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్ మెట్రో ప్రాజెక్ట్ (Medchal Metro Project) రావవడం వెనుక బీఆర్ఎస్ (BRS) పాత్ర అసలు లేనేలేదని అన్నారు. ప్రజలు జేఏసీ కమిటీ (JAC Committes) లు ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేసి మెట్రోను సాధించుకున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) సమయంలో తాను మేడ్చల్ (Medchal) ప్రాంతానికి మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చామని అన్నారు. మెట్రో రైలు కోసం తాను పోరాడానని, ఆ విషయాన్ని పలుమార్లు పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు.

మేడ్చల్ మెట్రో ప్రాజెక్ట్ కోసం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnav)ను కలిశానని.. నిధులు మంజూరు చేయాలంటూ అభ్యర్థించానని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) అలైన్‌మెంట్‌ (Alignment)లో చాలా తప్పులు జరిగాయని.. కొంతమంది ప్రభుత్వం పెద్దల ప్రమేయంతో అలైన్‌మెంట్ కూడా మారిందని కామెంట్ చేశారు. రిజినల్ రింగ్‌ రోడ్డు (Regional Ring Road) భూ నిర్వాసితులకు రూ.కోటి విలువైన భూమికి కేవలం ప్రభుత్వ ధర రూ.10 లక్షలు ఇస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే బీజేపీ (BJP) పోరాటానికి సిద్ధం అవుతుందని ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు. అదేవిధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Charlapally Railway Terminal)ను ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) వర్చువల్‌గా ప్రారంభిస్తారని.. కేంద్ర ప్రభుత్వం (Central Government) తరఫున కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ (Ravneet Sing) హాజరు అవుతారని ఆయన తెలిపారు.

Tags:    

Similar News