Allu Arjun: అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు.. బెయిల్ వస్తుందా.. రాదా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు (Sandhya Theater Stampede)లో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ (Regular Bail Petition)పై ఇవాళ నాంపల్లి కోర్టు (Nampally Court) తీర్పును వెలువరించనుంది.

Update: 2025-01-03 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు (Sandhya Theater Stampede Case)లో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ (Regular Bail Petition)పై ఇవాళ నాంపల్లి కోర్టు (Nampally Court) తీర్పును వెలువరించనుంది. అయితే, ఇదే కేసులో ఆయనకు ఇప్పటికే హైకోర్టు (High Court) కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలోనే తన క్లయింట్ అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) వాదనలు వినిపించగా.. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని డిఫెన్స్ లాయర్ కోరారు. అయితే, సంధ్య థియేటర్ తొక్కినలాట ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. రేవతి (Revathi) మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన బీఎన్ఎస్ సెక్షన్ 105 (BNS Section 105) ఆయనకు వర్తించదని అన్నారు. ఇప్పటికే కేసులో హైకోర్టు (High Court) మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందని రెగ్యులర్‌ బెయిల్‌ కూడా మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తుది తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందో.. లేదోనని దేశ వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Tags:    

Similar News