దమ్ముంటే ఆ MP పేరు బయటపెట్టు.. అంతేగాని ఊరికే గాలి మాటలు మాట్లాడకు.. కేటీఆర్‌కు DK అరుణ చురకలు
సెంట్రల్‌యూనివర్శిటీ భూముల విషయంలో సీఎం రేవంత్‌కు సహకరించిన బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్బయట పెట్టాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సెంట్రల్‌యూనివర్శిటీ భూముల విషయంలో సీఎం రేవంత్‌కు సహకరించిన బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్బయట పెట్టాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. రాజకీయాలకోసం గాలి మాటలు మాట్లాడొద్దని ఆయనకు దమ్ముంటే ఆ ఎంపీ ఎవరో పేరు చెప్పాలని నిలదీశారు. శనివారం విజయవాడ పర్యటనలో ఆమె మాట్లాడుతూ.. పేరు చెప్పకుండా ఒక ఎంపీ ఒక ఎంపీ అని మాట్లాడటం సరికాదని, వ్యక్తి ఎవరో చెప్పకుండా పార్టీపై నిందలు వేస్తారా అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్, కేటీఆర్ఒకే తాను ముక్కలే ఇద్దరు ఒకటే కావడంతో తమిళనాడులో జరిగిన స్టాలిన్ సమావేశానికి వెళ్లారు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాల కోసం స్టాలిన్ తహ తహ లాడుతున్నారని, తమిళనాడులో తండ్రీ కొడుకులే ఉండాలనుకుంటున్నారని ఆరోపించారు.
దేశంలోని దక్షిణాది రాష్ట్రాలపైనే బీజేపీ పార్టీ ఫోకస్ పెట్టిందని, అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలోనూ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడుతోందన్నారు. తెలంగాణాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిది మంది ఎంపీలు, నెల రోజుల కితం రెండు ఎమ్మెల్సీ స్ధానాలు గెలిచామన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా అధికారంలోకి రాబోతుందని ఈ అంశంపై అనుమానం అవసరం లేదన్నారు. ఆంధ్రాలో కూడా బీజేపీ ఎంపీలు గెలిచారని మా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఏపీలో కూడా మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అంబేద్కర్‌ను అడుగడుగునా కాంగ్రెస్మోసం చేసింది :
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని బీజేపీ శ్రేణులు తిప్పికొట్టాలని, నాయకులను మోసాలనకు ప్రజలకు వివరించాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కేంద్ర చేస్తుందో సామాన్యులకు తెలిపాలని, పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నేటి నుంచి ఈనెల 21 వరకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విస్తృతం ప్రచారం చేయాలని సూచించారు. అంబేద్కర్‌ను అడుగడుగునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనేని, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని తప్పుడు ప్రచారాలు చేశారని, దాని గురించి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు అంబేద్కర్‌ను అడుగడునా అవమానించిందని, ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్‌ను ఓటిమిపాలు చేసిన సంగతి ఎవరు మరిచిపోలేదన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది కాంగ్రెస్ నాయకులేనని మండిపడ్డారు.