Addanki: మోడీ, అమిత్‌ షా పెద్ద కేడీలు.. అద్దంకి దయాకర్ సెన్సేషనల్ కామెంట్స్

నేషనల్ హెరాల్డ్ (National Herald ) కేసులో కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను ఈడీ (Enforcement Directorate) ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ.. నిరసిస్తూ టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ (Hyderabad)లోని ఈడీ ఆఫీస్ (ED Office) ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.

Update: 2025-04-17 08:52 GMT
Addanki: మోడీ, అమిత్‌ షా పెద్ద కేడీలు.. అద్దంకి దయాకర్ సెన్సేషనల్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ (National Herald ) కేసులో కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను ఈడీ (Enforcement Directorate) ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ.. నిరసిస్తూ టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ (Hyderabad)లోని ఈడీ ఆఫీస్ (ED Office) ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోనే దమ్ము, ధైర్యం లేక కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దొంగ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. బ్రిటీష్ వాళ్లకే భయపడని కాంగ్రెస్ నిఖార్సైన లీడర్లు మోడీకి భయపడతారని అనుకోవడం వాళ్ల ముర్ఖత్వమేనని కామెంట్ చేశారు. తమ అధినాయకులపై కుట్రలు చేస్తున్న నరేంద్ర మోడీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah)లు పెద్ద కేడీలు అంటూ ఫైర్ అయ్యారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం అన్యాయంగా కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో బీజేపీ (BJP) నాయకుల పాత్ర ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. సెంటు భూమి, సొంత ఇల్లు కూడా లేని రాహుల్, సోనియాలపై కుట్రలు చేస్తే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వాదుల ఏకమవుతారు.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. 2029లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను తన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. దేశ ప్రతిపక్ష నాయకుడి రాజకీయాల నుంచి టర్మినేట్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశంలో బీజేపీ నాయకులు విద్వేషాన్ని రేపుతుంటే.. తమ నాయకులు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రేమను పంచుతున్నాడని.. అది కాంగ్రెస్ పార్టీ విధానమని. దేశంలో జరుగుతోన్న అక్రమాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే.. వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్న మోడీని పాతాళంలోకి తొక్కేస్తామని అద్దంకి దయాకర్ అన్నారు.  

Tags:    

Similar News