రాహుల్ గాంధీకి స్వీట్లు పంపిన బీజేపీ నేతలు

హర్యానా(Haryana), జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.

Update: 2024-10-08 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా(Haryana), జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. హర్యానాలో బీజేపీ(BJP) ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేసి.. వరుసగా మూడోసారి బీజేపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే హర్యానాలో దాదాపు బీజేపీ గెలుపు ఖరారు కావడంతో బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీజేపీ నేతలు స్వీట్లు పంపుతున్నారు. కాగా, హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు కావాలి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ఆధిక్యం, గెలుపు కలిపి 47 స్థానాల్లో దూసుకెళ్తోంది. దీంతో తమ గెలుపు డిసైడ్ అయిపోయిందని నెట్టింట్లో బీజేపీ శ్రేణులు సంబురాలు చేస్తున్నారు.


Similar News