'హిందువులు అంటే బీజేపీ ఒక్కటే కాదు'.. బీజేపీపై మల్లురవి ఫైర్

బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ హిందువుల మధ్య చిచ్చు పెడుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు.

Update: 2023-05-15 15:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ హిందువుల మధ్య చిచ్చు పెడుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ పుట్టక ముందే హిందూ మతం ఉందని అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హిందువులు అంటే బీజేపీ ఒక్కటే కాదని మతాలను రాజకీయాలకు వాడుకోవడం శోచనీయం అన్నారు.

Also Read..

బీఆర్ఎస్ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డేట్ ఫిక్స్.. వాటిపైనే ఫోకస్ 

Tags:    

Similar News