BJP: పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్.. కిషన్ రెడ్డి చొరవతో తొలగిన ప్రతిష్టంభన

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) చొరవతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల(Cotton Purchase)లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది.

Update: 2024-11-11 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) చొరవతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల(Cotton Purchase)లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియరైంది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కిషన్ రెడ్డి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్(Union Textiles Minister Giriraj Singh) తో మాట్లాడి, పరిస్థితిని వారికి వివరించి, రైతులను ఆదుకోవాలని కోరారు. కిషన్ రెడ్డి వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి తెలంగాణలో పత్తి కొనుగోళ్లు జరపాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Cotton Corporation of India) (సీసీఐ)(CCI)ను ఆదేశించారు. దీంతో పత్తి కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగనున్నాయి.

పత్తి కొనుగోళ్లలో గత ఏడాది సీసీఐ అనుసరించిన నియమ నిబంధనలనే ఈ ఏడాదీ పాటించనుంది. ఇక కొనుగోలు కేంద్రాలను సైతం గత ఏడాది ఏర్పాటు చేసిన సంఖ్యకు తక్కువ కాకుండా ఈసారీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ.7350 చొప్పున సీసీఐ కొనుగోలు చేయనుంది. పత్తి రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఈ ఏడాది రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు సృష్టించే తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మి దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News