రాజ్ తరుణ్-లావణ్య కేసులో సంచలన ట్విస్ట్.. తెరపైకి మస్తాన్ సాయి పేరు
రాష్ట్రంలో సంచలనంగా మారిన రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం అనూహ్యంగా మరో కీలక మలుపు తిరిగింది. సోమవారం గుంటూరులో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అనే యువకుడ్ని ఏపీ సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనంగా మారిన రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం అనూహ్యంగా మరో కీలక మలుపు తిరిగింది. సోమవారం గుంటూరులో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అనే యువకుడ్ని ఏపీ సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి ఈ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లు వెల్లడైంది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. విచారణలో ఇండస్ట్రీని కుదిపేస్తో్న్న రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో తెరపైకి ఈ మస్తాన్ సాయి పేరు వచ్చింది.
ఇతని ఫోన్‌లో అనేక మంది యువతుల ప్రయివేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వారితో చనువుగా ఉండి వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు. కాగా, లావణ్యకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో పరిచయం ఉందని రాజ్ తరుణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయనతో కూడా ఇలాగే గొడవ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిందని అన్నారు. రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం కోర్టులో నడుస్తున్న తరుణంలో మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ బయటకు రావడం, ఇప్పుడు అతని ఫోన్‌లో అమ్మాయిల వీడియోలు ఉండటం మరో సంచలనంగా మారింది.