BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్.. కుమారుడు రాహిల్‌కు బిగుస్తున్న ఉచ్చు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-03-21 03:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. షకీల్ కొడుకు రాహీల్ ప్రమాదం సమయంలో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ప్రమాదం కూడా రాహీలే చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో రాహిల్ డ్రైవర్ కారు నడిపినట్లు కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో 2022 మార్చి 17న యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రెండు నెలల బాలుడు మృతి చెందాడు. దుర్గుం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వస్తున్న మహీంద్ర థార్ కారు రోడ్డు దాటుతున్న యాచకులను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా 2 నెలల బాలుడు చనిపోయాడు. వాహనంలో ఉన్న వారు పారిపోయిన వాహనంపై స్టిక్కర్ ఆధారంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కారుగా పోలీసులు గుర్తించారు. అప్పట్లో తన కుమారుడు కారులో లేడని షకీల్ తెలిపారు. అఫ్రాన్ అనే యువకుడు తానే కారు నడిపానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. స్టీరింగ్ పై వేలిముద్రలు అఫ్రాన్ వే అని పోలీసులు ఆనాడు అనౌన్స్ చేశారు. తాజాగా ఈ కేసులో రాహిల్ స్వయంగా కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. లావుగా ఉన్న వ్యక్తి డ్రైవింగ్ సీటులో నుంచి దిగి పారిపోయాడని బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా షకీల్ కొడుకే డ్రైవింగ్ సీటులో ఉన్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.  


Similar News