Big Breaking : ఉస్మానియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం

దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన ఉస్మానియా విశ్వవిదాయలయం సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-09 14:52 GMT
Big Breaking : ఉస్మానియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన ఉస్మానియా విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. PhD ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు ఇకపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో అర్హత సాధించాలని తెలిపింది. ప్రవేశ పరీక్షల స్థానంలో పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం నెట్ స్కోర్‌లను ఉపయోగించాలని యూజీసీ యూనివర్సిటీలకు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో OU ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో.. OU రిజిస్ట్రార్ , ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ మాట్లాడూతూ.. 'యూజీసీ నిబంధనల ప్రకారం, పిహెచ్‌డి ప్రవేశాలు ఇక నుండి నెట్ స్కోర్‌ల ద్వారా మాత్రమే జరుగుతాయని, ప్రత్యేకంగా OU నుండి ఎలాంటి పిహెచ్‌డి ప్రవేశ పరీక్షలు నిర్వహించబడవని' తెలిపారు. కాగా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పటికే కేటగిరీ - I JRF కింద PhD అడ్మిషన్‌లను ప్రారంభించింది. వచ్చే జూన్ 2024 నుండి Phd ప్రవేశల కోసం NET లో అర్హత సాధించివుండాలని తెలిపింది. అయితే ఇంతకముందు OU లో PhD అడ్మిషన్‌లను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), NET/SET క్వాలిఫైడ్ మరియు PhD ప్రవేశ పరీక్ష ద్వారా మూడు కేటగిరీల్లో నిర్వహించేవారు.కానీ ఇక నుండి కేవలం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) - నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News