ఆ విషయంలో Bandi Sanjay సక్సెస్.. టీఆర్ఎస్‌కు దక్కని ఫలితం

ప్రచారానికి కేవలం రెండ్రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారంపై దృష్టి పెట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. శ్రేణులెవరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్‌లో పడొద్దని నాయకులకు దిశానిర్దేశం చేసింది.

Update: 2022-10-31 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రచారానికి కేవలం రెండ్రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారంపై దృష్టి పెట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. శ్రేణులెవరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్‌లో పడొద్దని నాయకులకు దిశానిర్దేశం చేసింది. మునుగోడులో విజయం సాధించి తామేంటో నిరూపించుకోవాలని సూచించింది. ముఖ్యమంత్రి విమర్శలను తిప్పి కొట్టాలని డిసైడ్ అయింది.

మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ నేత‌లే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌దీసింది. దీనికి కౌంట‌ర్‌గా బీజేపీ సైతం త‌న వ్యూహాల‌కు ప‌దునుపెట్టింది. అయితే తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. అయితే ఈ అంశం మునుగోడుపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశంపై ఎవరు ఎలా ఉన్నా బీజీపీ మాత్రం తమ పని తాము సైలెంట్‌గా చేసుకుపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యాన్ని వేదిక‌గా ఎంచుకుని తడి వస్త్రాలతో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రికి కూడా సవాల్ విసిరిన బండి.. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని క్లారిటీ ఇవ్వడంలో సంజ‌య్ స‌క్సెస్ అయ్యాడని రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ సాగుతున్నది. యాదాద్రి ప్రమాణం అనంతరం బండి సంజయ్ నేతలతో ముఖ్యమంత్రి ట్రాప్‌లో పడొద్దని, బైపోల్‌లో మరో 'ఆర్'ను గెలిపించుకుని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కు గిఫ్ట్ గా ఇవ్వాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

ప్రచారంపై దృష్టి..

ఉప ఎన్నికల ప్రచార పర్వం నవంబర్ 1వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాషాయదళం మొత్తం తమ ప్రచారంపై మాత్రమే దృష్టిసారించాలని రాష్ట్ర నాయకత్వం సూచనలు చేసింది. చివరి రెండ్రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారం, సభలపై దృష్టిసారించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరు సభలో కేంద్రంపై చేసిన విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. నేతలు కూడా ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు చేరువకావాలని జాతీయ నాయకత్వం సూచనలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జాతీయ నాయకులు సునీల్ బ‌న్సల్, త‌రుణ్ చుగ్, అర‌వింద్ మీన‌న్ రంగంలోకి దిగారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన కార్యాచ‌ర‌ణను శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి మునుగోడులో గెలిచేదెరు? మునిగేదెవరో కొద్దిరోజుల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి: మునుగోడు బైపోల్.. రాజగోపాల్ రెడ్డి కీలక ట్వీట్..  

Tags:    

Similar News