Bandi Sanjay: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కేంద్రమంత్రి ఘన నివాళులు

Update: 2024-09-10 06:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తొలితరం భూపోరాట ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి ఆమె సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ సహా ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జ్వలించిన నిప్పుకణిక అని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని కీర్తించారు.

తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత అని, మహిళా లోకానికి స్ఫూర్థి ప్రధాత అని చెబుతూ.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు తెలియజేస్తున్నామని రాసుకొచ్చారు. కాగా వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ దొరల పెత్తనాన్ని ఎదిరించి, రజాకార్లను తరిమికొట్టి వీరవనితగా పేరు తెచ్చుకుంది. తొలి భూపోరాటానికి నాంది పలికి, దొరలపై విజయం సాధించింది. ఆమె చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, ప్రజా పోరాటాలను స్పూర్తిగా నిలిచింది. ఇవాళ ఆమె 39వ వర్ధంతి వేడుకల సందర్భంగా తెలంగాణలో పలువురు నాయకులు నివాళులు అర్పించారు.


Similar News