Bandi Sanjay: నిరంకుశ నిజాం పీడ విరుగుడైన రోజు.. కేంద్రమంత్రి స్పెషల్ ట్వీట్

భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా 1948, సెప్టెంబర్ 17వ తేదీన నిజాం రాజు నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది.

Update: 2024-09-17 06:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా 1948, సెప్టెంబర్ 17వ తేదీన నిజాం రాజు నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది. దీంతో తెలంగాణ ప్రజలు ఈ రోజును ప్రత్యేక దినంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడ్డక బీజేపీ సెప్టెంబర్ 17ను తెలంగాణ వియోచన దినోత్సవంగా జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు.

ఇందులో నిరంకుశ నిజాం పీడ విరుగుడైన రోజు అని, రాక్షస రజాకర్ల పైశాచిక కరాల కృత్యాలకు చరమ గీతం పాడిన రోజు అని, రాక్షసుల పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందిన రోజు అని తెలిపారు. అంతేగాక సర్దార్ పటేల్ దృఢ సంకల్పంతో, ఎన్.రాయ్ చౌదరి నేతృత్వంలో, భారత మిలటరీ ధైర్య సాహసాలతో.. ఎందరో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా, మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా, నిజాం నిరంకుశ కబంధహస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు 'సెప్టెంబర్ 17' అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ "తెలంగాణ విమోచన దినోత్సవ" శుభాకాంక్షలు అని బండి సంజయ్ రాసుకొచ్చారు.


Similar News