తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ..? బాల్క సుమన్ ఫైర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను వాడుకున్న రేవంత్ రెడ్డి.. ఒక్కరికి కూడా కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకోవడం నిజం కాదా అని నిలదీశారు. వందల కోట్లు తీసుకుని ఒకే కుటుంబానికి చెందిన వివేక్, ప్రసాద్, వినోద్‌లకు టికెట్లు ఇప్పించాడని ఆరోపించారు. రోజుకో పార్టీ మారుతోన్న వినోద్-వివేక్‌లు స్వలాభం కోసమే కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.