Balakrishna : అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన బాలకృష్ణ, వరుణ్ ధావన్
హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు(Arrest)ను సీనియర్ హీరో..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Balakrishna)ఎక్స్ వేదికగా ఖండించారు.
దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు(Arrest)ను తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ పరిశ్రమ, తమిళ, మళయాల సినీ పరిశ్రమ ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. సీనియర్ హీరో..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Balakrishna)ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. అల్లు అర్జున్ ను అరెస్టును చేయడం అన్యాయమని.. ఇలా చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. మేము ఎల్లప్పుడూ అల్లు అర్జున్ కు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అటు అల్లు అర్జున్ అరెస్టును బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్(Varun Dhawan) కూడా ఖండించారు. అరెస్ట్ దురదృష్టకరమని.. నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని అభిప్రాయపడ్డారు. ఓ మనిషి చనిపోయిన ఘటన చాలా దురదృష్టకరమని చెప్పారు. కానీ ఈ ఘటనకు ఒక్కళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్నారు.