ఖమ్మంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బజరంగ్ దళ్ యత్నం
ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు యత్నించారు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్ట్‌లో పెట్టింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు యత్నించారు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్ట్‌లో పెట్టింది. దీంతో కాంగ్రెస్ మేనిఫెస్టోపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. తాజాగా ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో కాంగ్రెస్, బజరంగ్ దళ్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ నేతలు కర్ణాటక మేనిఫెస్టోను సమర్ధించారు. మతతత్వ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యత కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు.