పార్టీ మార్పు వార్తలపై స్పందించిన బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి

పార్టీ మార్పు వార్తలపై మాజీ ఆర్టీసీ చైర్మన్, బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పందించారు.

Update: 2024-03-11 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై మాజీ ఆర్టీసీ చైర్మన్, బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమని ఖండించారు. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో వీడబోను అని తేల్చి చెప్పారు. చివరి వరకు కేసీఆర్ వెంటే నడుస్తా అని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల బాజిరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. హస్తం పార్టీలో చేరికపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆయన్ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ పుకార్లపై స్పందించిన ఆయన తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అయితే, స్వతంత్రంగా రాజకీయ జీవితాన్ని ప్రాభించిన బాజిరెడ్డి.. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1994లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.

Tags:    

Similar News