Architecture Admission: బీ ఆర్కిటెక్చర్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్

బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అడ్మిషన్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి రిలీజ్ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో బుధవారం అడ్మిషన్ల కమిటీ మీటింగ్ జరిగింది.

Update: 2024-07-24 17:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అడ్మిషన్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి రిలీజ్ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో బుధవారం అడ్మిషన్ల కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా లింబాద్రి ఈ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఈనెల 26న నోటిఫికేషన్ ఇష్యూ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 9న స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 13న సవరణలకు, 16న ర్యాంకులు ప్రకటించనున్నట్లు తెలిపారు. కాగా ఆగస్టు 17, 18 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.

21న అభ్యర్థుల సీట్ల కేటాయింపు, 22, 23 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి సీటు కన్ఫమ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇకపోతే ఆగస్టు 25, 26 తేదీల్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 29న అభ్యర్థుల జాబితా, ఆగస్టు 30, 31 తేదీల్లో సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలను ఈనెల 26 నుంచి https://barchadm.tsche.ac.in వెబ్ సైట్ లో అందుబాటులోకి తెస్తామని లింబాద్రి వెల్లడించారు.

Tags:    

Similar News