తీన్మార్ మల్లన్నపై అటెంప్ట్ టు మర్డర్ కేసు!
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైంది. మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్ కాపీని మేడిపల్లి పోలీసులు రిలీజ్ చేశారు. 148, 307, 342,506, 384, 109,r/w 149 ఐపీసీ కింద మొత్తం 7 కేసులు నమోదైనట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సాయి కిరణ్ గౌడ్ అనే వ్యక్తిని అటెంప్ట్ టు మర్డర్ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు.
మల్లన్నతో పాటు సుదర్శన్, పరమేష్, రవీందర్, ప్రవీణ్ నలుగురిపై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మేడిపల్లి పోలీసులు, మల్లన్నను ఎల్.బి.నగర్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించగా రావనకల్ సాయి కిరణ్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నపై ఈ కేసులు ఫైల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.