Women Commission: మహిళా జర్నలిస్టులపై దాడి.. ఘటనపై స్పందించిన మహిళా కమిషన్

కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది.

Update: 2024-08-23 12:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనపై నివేదిక కోరుతూ.. నాగర్ కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. కొండారెడ్డిపల్లిలో ఆవుల సరిత, విజయారెడ్డి అనే మహిళా జర్నలిస్టులపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. వీడియో కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టులపై దాడిని ప్రతిపక్షాలు ఖండించాయి. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులపై జరిగిన దాడి పట్ల కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. అంతేగాక ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించి, సుమోటోగా స్వీకరించాలని ట్విట్టర్ వేదికగా కమిషన్ ను ట్యాగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. దీనిపై నాగర్ కర్నూల్ ఎస్పీకి లేఖ రాశానని తెలిపారు. ఈ విషయంలో న్యాయమైన, వేగవంతమైన దర్యాప్తును నిర్ధారించడానికి, సవివరమైన చర్య తీసుకున్న నివేదికను మహిళా కమిషన్ కు పంపాలని లేఖలో పేర్కొ్న్నట్లు నెరెళ్ల శారద తెలియజేశారు.


Similar News