దేశంలోనే తొలిసారిగా గవర్నర్ పురస్కారాలు... జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.

Update: 2024-11-01 17:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్టంలో వివిధ విభాగాలకు వారి చేసిన సేవలను గుర్తించి వారికి పురస్కారాలు అందించాలని నిర్ణయించారు. సమాజ శ్రేయస్సుకు వారి అందించిన సేవలను గుర్తించండం ద్వారా వారి ప్రొత్సహించవచ్చని వారు సమాజ హితానికి మరింతగా తొడ్పడుతారని, ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. దీనిలో భాగంగా నాలుుగు విభాగాల్లో గత ఐదు సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో వారు చేసిన కృషికి అవార్డులు అందించనున్నారు. అవార్డుల విషయాలను శుక్రవారం గవర్నర్ కార్యదర్శి బుర్ర వెంకటేశం శుక్రవారం రాజ్ భవన్ లో మీడియాకు వెల్లడించారు. ఈ అవార్డులను సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరకాస్తులను రాజ్ భవన్ ఆహ్వానిస్తుందని ఆయన వెల్లడించారు. దరకాస్తులను ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో సమర్పించాలని ఆయన సూచించారు. ఎంపిక చేసిన వారికి వచ్చే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కారాలను ప్రధానం చేసి వారిని సత్కరిస్తారని బుర్ర వెంకటేశం తెలిపారు.

విధివిధానాలు :

ప్రతి విభాగంలో రెండు కేటగిరీల అవార్డులు ఉంటాయి. ఒక కేటగిరీ లో వ్యక్తిగతంగా విజయం సాధించిన వారికి, రెండో కేటగిరిలో ఆయా విభాగాలలో అభివృద్ధి కోసం కృషి చేసిన సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్ లకు అవార్డు అందిస్తారు. ప్రతి అవార్డు కింద రెండు లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. ఈ అవార్డులకు 2019 నుంచి ఆయా విభాగాల్లో వారు వ్యక్తిగతంగా, సంస్థల పరంగా అందించిన సేవలకు దరకాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరకాస్తులను గవర్నర్ ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించి వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది. ఆయా రంగాల్లో సేవలు అందించిన వారే కాకుండా ఇతరులు, లేదా సంస్థలు వారిని ప్రతిపాదిస్తూ దరకాస్తు చేసే అవకాశాన్ని కల్పించారు. ఆఫ్ లైన్ లో దరకాస్తు చేసుకోవడానికి https://governor.telangana.gov.in లో దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఆ దరకాస్తులను పూర్తి చేసి రాజ్ భవన్ కు పంపించాలని లేదా స్వయంగా కూడా అందించవచ్చని తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తులను రాజ్ భవన్ వెబ్ సైట్ లో దరకాస్తును, ఇతర పత్రాలను ఆప్ లోడ్ చేయాలని సూచించారు.

అవార్డు విభాగాలు :

1) పర్యావరణ పరిరక్షణ

2) దివ్యాంగుల సంక్షేమం

3) క్రీడలు, ఆటలు

4) సాంసృతిక విభాగం

Tags:    

Similar News