విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల ఆరు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే క్లాసులు

Telugu News , Latest Telugu news , Latest News in Telugu

Update: 2024-11-01 17:29 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 6 నుంచి తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కులగణన చేసేందుకు అన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం 80వేల మంది సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్(School Education) పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్‌లు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 40వేల మంది ఎస్‌జీటీ(SGT), పీఎస్‌హెచ్‌ఎం(PSHM)లను సర్వేలో ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ(Department of Education)ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం(Burra Venkatesham) ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేలో విద్యాశాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్​సీ(MRC) సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినిగియోచుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సర్వేలో అత్యధికంగా టీచర్లు పాల్గోంటుండటంతో.. ఈ మూడు వారాల పాటు ప్రాథమిక పాఠశాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. ఆ తర్వాత పాఠశాల సిబ్బంది ప్రభుత్వ సర్వేలో పాల్గొననున్నారు.


Similar News