Road Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదం (Road Accident)లో 30 మందికి గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడ (Kodada) జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Update: 2024-11-02 01:55 GMT
Road Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్/కోదాడ: రోడ్డు ప్రమాదం (Road Accident)లో 30 మందికి గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడ (Kodada) జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి (రాజమండ్రి) గోకవరం‌కు ప్రయాణికులతో వెళ్తున్న మహి ట్రావెల్స్ బస్సు కోదాడ సమీపంలోకి రాగానే ప్రయాణికులు వాష్ రూంకి వెళ్తానంటే రోడ్డు పక్కనే నిలిపాడు. ఈ క్రమంలోనే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు, ట్రావెల్స్ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయాలైన 25 మందిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురిని కోదాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. వారిలో నలుగురు పరిస్థితి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఆగి ఉన్న బస్సు ఒక్కసారిగా రోడ్డు మీదికి రావడం‌తోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిలో వెంకటేశ్వరరావు, కే.మణి, దానియేలు, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నవ్య, ఆదిత్య, తేజ, డేవిడ్ కోదాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News