‘సీతక్క అందరికీ అక్కే’.. కౌశిక్ రెడ్డికి స్పీకర్ చురకలు
వ్యవసాయం మీద చర్చలో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చురకలంటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయం మీద చర్చలో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చురకలంటించారు. వ్యవసాయంపై బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని.. రైతులకు అందించిన స్కీముల గురించి కౌశిక్ వివరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సన్న వడ్లకు సంబంధించి బోనస్ బోగస్ అంటూ కౌశిక్ మాట్లాడారు. అదే సందర్భంలో రైతుబంధు విషయమై సీఎం రేవంత్‌పైనా పలు కామెంట్స్ చేశారు. దాంతో మంత్రి సీతక్క జోక్యం చేసుకున్నారు. అదే సందర్భంలో ‘సీతక్క మీరు నాకు అక్కలాంటివారు. మీరంటే మాకు గౌరవం ఉంది’ అని కౌశిక్ అన్నారు. దాంతో స్పీకర్ కలుగజేసుకొని.. ‘సీతక్క ఎవరికి అయినా అక్కే’ అని మిగితా చర్చ కొనసాగించాలని సూచించారు.