నాకు ఆ శాఖ అంటే ఇష్టం.. మంత్రి పదవిపై మనసులోని మాటను బయటపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాకు ఆ మంత్రిత్వ శాఖ అంటే ఇష్టం కానీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: నాకు ఆ మంత్రిత్వ శాఖ అంటే ఇష్టం కానీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని మునుగోడు (Munugodu) కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Congress MLA Komatireddy Rajagopal Reddy) తన మనసులోని మాటను బయటపెట్టాడు. అసెంబ్లీ మీడియా పాయింట్ (Assembly Media Point) లో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి (Minister Post) వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, భువనగిరి ఎంపీ ఎన్నికల (Bhuvanagiri MP Elections) బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించానని చెప్పారు. అంతేగాక తనకు హోం మంత్రిత్వ శాఖ (Home Ministry) అంటే ఇష్టమని, కానీ ఏ పదవి ఇచ్చినా సమర్థవంతగా నిర్వహిస్తానని మీడియా ముఖంగా తన అభీష్టాన్ని బయటపెట్టారు. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని ఆయన అన్నారు.
కాగా సోమవారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఇందులో ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ చర్చ జరిగింది. ఇందులో పలు సామాజిక వర్గాల నుంచి నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులకు చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై అసెంబ్లీ లాబీల్లో సైతం నేతలు మాట్లాడుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తోంది.