ఉస్మానియా యూనివర్సిటీపై కేసీఆర్‌‌కు కోపం.. ఎందుకంటే? అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఉస్మానియా యూనివర్సిటీపై కేసీఆర్‌ పగ పట్టారని పరోక్షంగా కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2025-03-25 09:33 GMT
ఉస్మానియా యూనివర్సిటీపై కేసీఆర్‌‌కు కోపం.. ఎందుకంటే? అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీపై (Osmania University) కేసీఆర్‌ (KCR) పగ పట్టారని కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Sathyam) పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శాసన సభలో కేసీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో 2014లో కేసీఆర్‌ హెలికాప్టర్‌ను ఉస్మానియా యూనివర్సిటీలోకి రాకుండా విద్యార్థులు అడ్డుకొని తిరగబడ్డారని ఆయన అన్నారు. ఆ కోపం మనసులో పెట్టుకొని.. ఏనాటికైనా యూనివర్సిటీలు బాగుంటే కంటి కింద నలుసులా తయారవుతాయని, ఈ రెండు కారణాల వల్ల యూనివర్సిటీలను పట్టించుకోకుండా నాశనం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వర్సిటీలకు సరైన సమయంలో వీసీలను నియమించలేదని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు పది యూనివర్సిటీల్లో ఒక టర్మ్ మొత్తం కూడా వీసీలను నియమించని చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు.

Tags:    

Similar News