Telangana Politics: ఉగాది తర్వాత తెలంగాణలో హైవోల్టేజ్ పాలిటిక్స్! ప్రధాన పార్టీల కొత్త ప్లాన్స్ ఇవేనా?

తెలంగాణలో రాజకీయం వేగంగా మారుతోంది.

Update: 2025-03-25 09:16 GMT
Telangana Politics: ఉగాది తర్వాత తెలంగాణలో హైవోల్టేజ్ పాలిటిక్స్! ప్రధాన పార్టీల కొత్త ప్లాన్స్ ఇవేనా?
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: విమర్శలు.. ప్రతివిమర్శలు, కౌంటర్లు.. ఎన్ కౌంటర్లతో ఇప్పటి వరకు సాగిన తెలంగాణ రాజకీయం (Telangana Politics) ఇక కొత్త ట్రాక్ లోకి వెళ్లబోతోంది. తెలుగు వారి కొత్త ఏడాది ఉగాది (Ugadi) తర్వాత అంతా అంతా ఫేస్ టూ ఫేస్.. నెక్ టూ నెక్ అనేలా హై వోల్టేజ్ పాలిటిక్స్ (High Voltage Politics) సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంటే వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు కౌంటర్ ప్లాన్ లు రెడీ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు ఇచ్చిన ఏడాది గవుడు ముగిసిపోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS), బీజేపీలు (BJP) అధికార పక్షంపై సై అంటే సై అనేలా రాజకీయం చేసేందుకు సై అంటున్నారు. మూడు ప్రధాన పార్టీల మధ్య పొలిటికల్ వార్ నేపథ్యంలో ఈసారి ఉగాది పొలిటికల్ పంచాంగంలో ఎలాంటి టర్న్ లు.. యూ టర్న్ లు మరెలాంటి ట్విస్ట్ లు ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మంత్రి వర్గ విస్తరణతో ప్రజాక్షేత్రంలోకి..

ప్రజాక్షేత్రంలో పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేసేందుకు అధికార కాంగ్రెస్ (Congress) ప్రణాళికలు రచిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రి వర్గ విస్తరణను దాదాపుగా ఉగాది నాటికి అటు ఇటుగా పూర్తి చేసి పార్టీ, ప్రభుత్వ పరంగా కొత్త జోష్ నింపేందుకు కసరత్తు చేస్తోంది. నామినేటెడ్ పదవులు, పీసీసీ కార్యవర్గ కూర్పు చేసి పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపాలని చూస్తోంది. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా స్టేట్ పాలిటిక్స్ ను రంజుగా మార్చేందుకు హస్తం పార్టీ అవసరమైన ప్లాన్లు సిద్ధం చేస్తు్న్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ నయా స్కెచ్:

బీఆర్ఎస్ సైతం ఉగాది అనంతరం సరికొత్త కార్యచరణతో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఉగాది కంటే ముందే ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కారు పార్టీ సిద్ధం అవుతున్నది. పార్టీ ఆవిర్భావదినోత్సవం వేదికగా పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలు, నిర్ణయాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నా అధినేత కేసీఆర్ (KCR) ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటం గులాబీ పార్టీకి పెద్ద మైనస్ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీ ప్లీనరీ తర్వాత నయా స్కెచ్ తో కేసీఆర్ పార్టీని ముందుకు తీసుకుపోబోతున్నారనే చర్చ గులాబీ పార్టీలో వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ రౌండప్ చేసేలా కొత్త కార్యచరణను సిద్ధం చేసుకుని ఉగాది తర్వాత ఆచరణలో పెట్టి పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు ఉండబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

బీజేపీని ఊరిస్తున్న కొత్త బాస్ పోస్టు:

తెలంగాణ బీజేపీలో రోజు రోజుకు కొత్త ఊపు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తన కెపాసిటీని పెంచుకుంటూ వస్తున్న బీజేపీలో కొత్త బాస్ అంశం ఇప్పటికీ ఊరిస్తూనే ఉంది. రాష్ట్ర రథసారథిగా కొత్త వ్యక్తి నియామకం దాదాపు ఖరారైందని ఏ క్షణమైనా రాష్ట్ర అధ్యక్షుడి పేరును పార్టీ పెద్దలు అనౌన్స్ చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ విజయాలతో జోరుమీదున్న కమలం పార్టీలో కొత్త అధ్యక్షుడు నియామకం ఆసక్తిని పెంచుతోంది. ఈ విషయంలో చాలా కాలంగా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. సుదీర్ఘ కసరత్తు, సంప్రదింపుల అనంతరం కొత్త అధ్యక్షుడి పేరును ఉగాది వరకు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలకు ఇప్పటికే అమిత్ షా (Amit Shah) టార్గెట్ విధించారు. ఇటీవల తనతో భేటీ అయిన రాష్ట్ర నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం తద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకోవాలని స్టేట్ లీడర్స్ కు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి కొత్త బాస్ నియామక ప్రక్రియ జరిగిపోతే ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ సరికొత్త ఉత్సాహంతో రాజకీయం సాగించనుందనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News