Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి వాయిదా తీర్మాణం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Asswembly Meetings) జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మరోసారి వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టనుంది.

Update: 2024-12-17 05:21 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Asswembly Meetings) జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మరోసారి వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టనుంది. లగచర్ల ఘటనపై(Lagacharla Incident) చర్చను కోరుతూ వాయిదా తీర్మాణం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహా పట్నం నరేందర్ రెడ్డి సహా కొందరుర రైతులు అరెస్ట్ అయ్యారు. దీనిపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్(Demand) చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR).. రాష్ట్రంలో పరిశ్రమల పేరిట సాగుభూముల బలవంతపు సేకరణను వ్యతిరేకిస్తున్న అమాయక రైతుల అక్రమ అరెస్ట్, నిర్భంధంపై మరియు వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ.. అసెంబ్లీలో చర్చకై వాయిదా ప్రతిపాదన ప్రవేశపెట్టనున్నారు. కాగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా లగచర్ల ఘటనపై చర్చ జరపాలని హరీష్ రావు కోరిన వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) తిరస్కరించారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ సమావేశాల నుంచి, బీఏసీ సమావేశం నుంచి సైతం వాకౌట్ చేశారు. 


Similar News