సంసారం చేయకముందే పిల్లలు పుడతరా?.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
పెళ్లి కాకముందే.. సంసారం చేయకముందే పిల్లలు పుడతరా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు
దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లి కాకముందే.. సంసారం చేయకముందే పిల్లలు పుడతరా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి పత్రాలు పంచుకుంటూ.. తాను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడని, అందుకు సిగ్గు అనిపియ్యదా రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఆ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, పెళ్లి కాకముందే, సంసారం చేయ్యకముందే పిల్లలు పుడతరా ఎక్కడైనా అని ఎద్దేవా చేశారు.
అలాగే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి తాను ఇచ్చినట్లు చెప్పుకుంటాడని, కేసీఆర్ కట్టిన బ్రడ్జిలకు తాను రిబ్బన్ కట్ చేసి ఆయనే కట్టినట్లు చెప్పుకుంటున్నాడని విరుచుకుపడ్డారు. అంతేగాక ఈ ముఖ్యమంత్రి గత సంవత్సరం వానలు పడక, ఇప్పుడు కరువు ఏర్పడుతుందని దొంగమాటలు చెబుతున్నాడని, గతేడాది తెలంగాణలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు అయ్యిందని, ప్రభుత్వాన్ని నడప చేతగాక, రైతులకు నీళ్లివడం ఇష్టం లేక దొంగ మాటలు మాట్లడుతున్నాడని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని కేటీఆర్ ఆరోపించారు.