మేడిగడ్డ డ్యామేజీపై తెలంగాణ సర్కారు మరో సంచలన నిర్ణయం
మేడిగడ్డ డ్యామేజీ అంశంలో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ డ్యామేజీ అంశంలో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మేడిగడ్డలో ఏడో గేట్‌ను ఇంజినీర్లు ఎత్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల అనుగుణంగా.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఎల్ అండ్ టీ సంస్థ మాత్రం మెయింటెనెన్స్‌లోని రిపేర్లు మాత్రమే చేస్తామని చెప్పింది. ఏడో బ్లాక్‌లోని 20, 21 గేట్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజ్‌కు మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం.. పుణె సంస్థ ఇచ్చిన నివేదికతో ముందుకు వెళ్లే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.