లిక్కర్ లారీని ఢీకొన్న మరో లారీ.. ఒకరు మృతి

రెండు లారీలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2023-05-12 06:46 GMT

దిశ, మేడ్చల్ టౌన్: రెండు లారీలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ జాతీయ రహదారిపై డబిల్ పూర్ చౌరస్తా వద్ద గురువారం అర్ధరాత్రి ఆగి ఉన్న లిక్కర్ లారీని వెనుక నుండి సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Also Read.

HYD: కత్తితో పొడిచి భార్యను భవనం మీదనుంచి పడేసిన భర్త 

Tags:    

Similar News