HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరో కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీలో హైడ్రా(Hydra) భాగం కాదని.. సెపరేట్ వింగ్ అని కమిషనర్ రంగనాథ్(Ranganath) స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీలో హైడ్రా(Hydra) భాగం కాదని.. సెపరేట్ వింగ్ అని కమిషనర్ రంగనాథ్(Ranganath) స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ వెదర్, క్లైమెట్ సర్వీసెస్ పై స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. మరో 27 మున్సిపాలిటీల పరిధిలోనూ హైడ్రా పనిచేస్తుందని అన్నారు. ఐఎండీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను అధికారులు నిర్ణయించారు.
ఇకపై చెరువులు అన్యాక్రాంతం కాకుండా హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు మొదటి కమిషనర్‌గా ఉండటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మొదటి సారి హైడ్రా లాంటి వ్యవస్థను తెలంగాణలో తీసుకొచ్చారని అన్నారు. కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మునిసిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది.. వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్, లేక్స్ ఆక్రమణలకు గురవుతున్నాయి.. వాటికోసం హైడ్రా పనిచేస్తుందని కీలక ప్రకటన చేశారు.