ఎస్ఎల్బీసీ పనులకు మళ్లీ బ్రేక్... ఇలా ఎప్పటినుంచి జరుగుతుందంటే?

ఉమ్మడి నల్గొండకు నీటి వరప్రదాయనిగా 3.50లక్షల ఎకరాలకు సాగు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

Update: 2025-02-23 04:03 GMT
ఎస్ఎల్బీసీ పనులకు మళ్లీ బ్రేక్... ఇలా ఎప్పటినుంచి జరుగుతుందంటే?
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఉమ్మడి నల్గొండకు నీటి వరప్రదాయనిగా 3.50లక్షల ఎకరాలకు సాగు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 2007లో ప్రారంభమైన ఈ పనులకు తొలినుంచి ఆటంకాలు కలుగుతున్నాయి. 2012 వరకే పూర్తి కావాల్సి ఉన్న పనులు ఇప్పటికీ కొనసాగుతుండగా తాజాగా టన్నెల్‌లో మట్టి, నీళ్లు కురుస్తుండడంతో ఎస్ఎల్బీసీ పనులకు మళ్లీ బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.

పనులకు బ్రేక్...!

ఉమ్మడి నల్లగొండకు శ్రీశైలం నుంచి నీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను చేపడుతున్నారు 2007లో 1,925 కోట్ల అంచనాతో 3.50 వేల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి నల్గొండ జిల్లా చందంపేట నక్కలగండి వరకు దాదాపు 44 కిలోమీటర్ల సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది. కాగా ఈ సంవత్సరం జనవరి వరకు ఇన్ లెట్ లో 14 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వగా మరో 6 కిలోమీటర్ల వరకు తవ్వాల్సి ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇన్ లెట్ సొరంగం సముద్ర మట్టానికి 854 అడుగుల ఎత్తు వద్ద తగ్గుతుండగా శ్రీశైలం రిజర్వాయర్ 885 అడుగుల ఎత్తు వద్ద నీటితో ఉంది శ్రీశైలం రిజర్వాయర్ కంటే ఇది దిగున ఉండడం వల్ల ఓటనీరు అధికంగా రావడం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇలా 2019 నుంచి ఊట నీరు వస్తోంది తరచుగా మట్టి, రాళ్లు కురుస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు ఇక్కడ గ్రానైట్ కంటే మట్టి సన్నగాళ్లు ఎక్కువగా వస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ అధికారులు గ్రౌండ్ చేస్తున్న కప్పును బలంగా ఉంచలేక పోతుంది ఈ సమస్య తీవ్రవం కావడంతో 2019 నుంచి పనులు నిలిచిపోయాయి. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సెప్టెంబర్ లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు SLBC ప్రాజెక్టును పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో గ్రీన్ ఛానల్‌లో నిధులు ఇచ్చేందుకు నిర్ణయించారు. అలాగే ఈ ఏడాది బడ్జెట్లో 800 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దీంతో గత నాలుగు రోజుల క్రితం అధికారులు పనులను ప్రారంభించారు. పనుల్లో భాగంగా తొలగించాల్సిన మిషన్‌కు సంబంధించి బేరింగ్ చెన్నయ్ పోటు నుంచి మన్నేవారి పల్లికి చేరుకోవడంతో పనులు తిరిగి మొదలయ్యాయి. ఇంతలోనే టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద నీరు మట్టి దిబ్బలు కూలిపోవడంతో 20 మంది కార్మికులు అందులోని చిక్కుకుపోయారు. దీంతో భవిష్యత్తులో పనులు జరగడంపై సందేహాలు నెలకున్నాయి.  

Tags:    

Similar News