BRSకు బిగ్ షాక్.. రేపు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది.

Update: 2024-07-11 12:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కారు పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలు కంటి  మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుసగా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే కారు పార్టీ దిగి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్‌తో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నేతలు చేరనున్నారు.  


Similar News