తెలంగాణలో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి MP ఇంట్లో చొరబడ్డ అగంతకుడు

తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) ఇంట్లో కలకలం రేగింది.

Update: 2025-03-16 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) ఇంట్లో కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని ఆమె నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని కిచెన్, హాల్, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోనికి వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటూ, ఇటూ తిరిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై.. విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ(DK Aruna) దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు(Jubilee Hills Police) ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తన ఇంటికి భద్రత పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, దుండగుడు ఇంట్లో చొరబడ్డ సమయంలో డీకే అరుణ లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

మహిళా మోర్చ జిల్లా మాజీ అధ్యక్షురాలికి అవమానం 

Tags:    

Similar News