Traffic jam: మియాపూర్‌లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను నిలిపివేసిన ఆర్టీసీ బస్సు

ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు అప్పుడప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకోవడం చూస్తూనే ఉంటాం. అ

Update: 2024-06-25 03:15 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు అప్పుడప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే నేడు ఆ ఆర్టీసీ బస్సే ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుకోనివ్వకుండా ట్రాఫిక్‌ని జామ్ చేసింది. పొద్దుపొద్దునే ట్రాఫిక్‌జామ్ కావడంతో వాహణధారులు కిలోమీటర్ల మెర బారులు తీరారు. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్ బొల్లారం రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. దీని కారణంగా జనప్రియ వెస్ట్ సిటీ నుండి మియాపూర్ మెట్రో వరకు మొత్తం 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

దీనితో కొంతమంది వాహణధారులు గల్లీల గుండా వెళ్లేందుకు యత్నించినా, చేదు అనుభవమే ఎదురైంది. ఎందుకంటే గల్లీలో సైతం ట్రాఫిక్ బారులు తీరింది. దీనితో గంటల తరబడి స్కూల్ బస్సులు , ట్రావెల్స్ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్‌లో నిలిచి పోయాయి. దీని కారణంగా విద్యార్థులు, ఆఫీస్‌లకి వెళ్లే ఉద్యోగులు, టైమ్ అవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా ట్రాఫిక్ సమస్యను నియాంట్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సాయశక్తుల ప్రయటిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు ఆగిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలీయలేదు. కాగా స్థానికుల సమాచారం ప్రకారం సాకేతిక కారణాలతోనే బస్సు రోడ్డుపై నిలిచిపోయినట్టు సమాచారం.  


Similar News