Thungathurthi: రైతులా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పండగలా మారిందని తుంగతుర్తి(Thungathurti) ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandhula samelu) అన్నారు.

Update: 2024-12-29 13:03 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పండగలా మారిందని తుంగతుర్తి(Thungathurti) ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandhula samelu) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagirir District) అడ్డగూడూరు(Addaguduru) మండలంలోని ధర్మారం(Dharmaram) గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేలు ఆదివారం తలకు కండువా చుట్టి సాధారణ రైతులా మరిపోయారు. ఆయన సొంత పొలంలో వరినాట్లు వేస్తున్న వ్యవసాయ కూలీలతో కలసి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు అందరితో కలిసి పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పారు. అలాగే ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం రైతులకు పండగలా మారిందని వివరించారు. అంతేగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవసాయానికి పెద్దపీట వేసారని కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు.

Tags:    

Similar News