Numaish: నుమాయిష్ ప్రారంభం వాయిదా.. ఎందుకంటే?
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి ఏడాది నుమాయిష్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ (Exhibition) గ్రౌండ్‌లో ప్రతి ఏడాది నుమాయిష్ (Numaish) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 1న ప్రారంభం కావాల్సిన (నుమాయిష్) అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (postponed) వాయిదా పడింది. ప్రతి ఏటా షెడ్యూల్ ప్రకారం జనవరి 1వ తేదీన ఈ నుమాయిష్ ప్రారంభమవుతుంది. దాదాపు 46 రోజుల పాటు పారిశ్రామిక ప్రదర్శన జరుగుతుంది. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సంతాప దినాల నేపథ్యంలో నుమాయిష్ రెండు రోజుల పాటు వాయిదా పడినట్లు నిర్వాహకులు తెలిపారు.
జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రదర్శనకు గాను దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణం చేసేందుకు నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ప్రదర్శన ఏర్పాట్లు పనులు చకచకా సాగుతున్నాయి. కాగా, 1938 నిజాం కాలంలో మొదలయిన నుమాయిష్‌కు తెలుగు రాష్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తుంటారు.