సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి : రఘునందన్ రావు

సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Update: 2024-12-29 13:09 GMT

దిశ, సంగారెడ్డి : సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ… కేసీఆర్ ఉంటే అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలే ఉంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన వచ్చాక కూడా సేమ్ సీన్ కొనసాగుతుందన్నారు. గత ఏడాది వరంగల్ లో ధర్నా చేస్తున్న సమగ్ర ఉద్యోగుల వద్దకి పీసీసీ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి చాయ్ తాగినంత సేపులో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన మాట ఆయన మరిచారని ఎద్దెవ చేశారు. సీఎం చాయ్ తాగడం లేదేమో కేసీఆర్ తాగింది తాగుతున్నట్టు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు మొత్తం చాయ్ మానేసినట్లు ఉన్నారన్నారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం వేతనంలో ఇస్తుంది, తాను ఇప్పిస్తానన్నారు. మిగతా 40శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వెంటనే ఇచ్చి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏం భారం పడదన్నారు. ప్రభుత్వ పెద్దలు గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డిలు ఫార్మాసిటీలు, ఫోర్త్ సిటీలు, దావోస్ ల గురించి మాట్లాడుతారు తప్ప ప్రజల గురించి మాట్లాడరన్నారు. తనను ఆదరించి ఎంపీగా గెలిపించారు..తాను మీ గొంతుగా నిలబడతానని హామీ ఇచ్చారు. సీఎం అపాయింట్మెంట్ అడుగుతాను..సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, మాణిక్ రావు, పోచారం రాములు, కొండాపురం జగన్, రాజశేఖర్ రెడ్డి, ద్వారక రవి, కసిని వాసు, ప్రవీణ్, బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షుడు దత్తాద్రి, ఉద్యోగులు పాల్గొన్నారు.


Similar News