ఆ విషయంలో మినహాయింపు ఇవ్వాలని.. మహిళా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా

అదనంగా ఏడు మార్కులు కలపడంతో క్వాలిఫై అయిన వారికి బుధవారం నుంచి ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Update: 2023-02-16 07:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అదనంగా ఏడు మార్కులు కలపడంతో క్వాలిఫై అయిన వారికి బుధవారం నుంచి ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు ఈవెంట్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గురువారం గర్భిణీ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం ఏడు మార్కులు కలపడంతో అర్హులైన వారికి ఈరోజు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు.

అయితే, వీరిలో కొందరు గర్భవతులు ఉండడంతో తమను ఫిజికల్ టెస్ట్ నుంచి మినహాయించాలని కోరుతూ సుమారు 40 మంది అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. గర్భంతో ఉన్న వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ట్రైనింగ్ సెంటర్ దగ్గర, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాగా, గర్భంతో ఉన్న వారికి నేరుగా మెయిన్స్ రాసుకునేందుకు అవకాశం ఇచ్చేలా జనవరిలో టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది.

మెయిన్స్ అనంతరం వారికి ఈవెంట్స్ నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఈ ఆర్డర్స్ ఏడు మార్కులు కలిపిన వారికి వర్తించవని అధికారులు చెబుతుండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా మినహాయింపు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News