Aghori : ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్న అఘోరీ

తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ (Aghori) మాత మెదక్ ఏడుపాయల వనదుర్గా(Vana Durgamma of Edupayala) ఆలయాన్ని సందర్శించారు

Update: 2024-11-14 07:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ (Aghori) మాత మెదక్ ఏడుపాయల వనదుర్గా(Vana Durgamma of Edupayala) ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అఘోరీని చూసేందుకు, ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిమాలయాలను వదిలి దేశంలో పర్యటిస్తున్నానని చెప్పిన అఘోరీ తన మాటలు, చర్యలతో వివాదస్పద మయ్యారు. హిందు దేవాలయాలపైన, బాలికలు, మహిళలపైన దాడులను నిరసిస్తూ ఒకసారి, శ్రీకాళహస్తీలో దిగంబరంగా దర్శనం చేసుకోవడాన్ని అడ్డుకున్నందుకు మరోసారి ఆత్మార్పణ యత్నాలు చేసిన అఘోరీ చర్యలు సంచలనంగా మారాయి.

మహిళలపైన, దేవాలయాలపైన దాడులు ఆపకపోతే తెలంగాణ ప్రభుత్వానికి శివతాండవం చూపిస్తానంటూ, అత్యాచారాలకు పాల్పడే వారి అంగాలను ఖండిస్తామంటూ హెచ్చరికలు చేశారు. అఘోరీ తొలుత తమిళనాడు నుంచి తెలంగాణకు, ఇక్కడి నుంచి కేదరినాథ్ కు, మళ్లీ తెలంగాణకు, ఇటు నుంచి కార్తీక మాసం శైవ క్షేత్రాల సందర్శన పేరుతో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి, మళ్లీ తెలంగాణకు చేరుకుని తన చర్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. 

Tags:    

Similar News