TSPSC పేపర్ లీక్ కేసులో విచారించాల్సింది వాళ్లనే!
టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ, డీఎవో పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసే సిబ్బందిపై కాకుండా యాజమాన్యాలపై విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌లు డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ, డీఎవో పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసే సిబ్బందిపై కాకుండా యాజమాన్యాలపై విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌లు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ జరిగిన కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి కళాశాలకు బీఆర్ఎస్ నాయకులతో, ప్రభుత్వ పెద్దలతో స్నేహ సంబంధాలు ఉండటం వల్లే కళాశాల పేరు బయట పెట్టకుండా అధికారులు భయపడుతున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ వెనుక ప్రభుత్వ హస్తం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ వ్యవహారంలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడినందుకు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన ఇంజినీరింగ్ కళాశాల హెచ్ఓడీ, ఫిజికల్ డైరెక్టర్లను విచారించాలని కోరారు.