భూ సార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం.. మంత్రి నిరంజన్ రెడ్డి
భూ సారి పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: భూ సారి పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు 65 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలను సప్లై చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. 1445 డీసీఎంస్, పీఎసీఎస్ , ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో తీసుకురావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 46 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్దమయ్యాయన్నారు. పచ్చి రొట్ట ఎరువులతో నాణ్యమైన, ఆరోగ్యవంతమైన పంట దిగుబడులు వస్తాయన్నారు. రైతులను పచ్చి రొట్ట ఎరువుల వినియోగంపై నిరంతరం చైతన్యం చేయాలన్నారు.
విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వాడకం ద్వారా నేలల సహజ స్వభావం దెబ్బతింటున్నదని, భూమి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కోల్పోతున్నదన్నారు. దీంతో సేంద్రియ కర్భనం తగ్గిపోతూ పంట నష్టాన్ని తీసుకువస్తుందన్నారు. చాలా ప్రాంతాలలోపశువులు, కోళ్లు ,గొర్రెలు, వర్మి కంపోస్ట్ ఎరువుల వాడకం ఉన్నా.. అవి రైతులకు భారంగా మారిందన్నారు. అందుకే పచ్చిరొట్ట పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలోవ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ప్రత్యేక కమిషనర్ హన్మంతు సీడ్స్ ఎండీ కేశవులు, ఏడీడీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.