జాబ్ క్యాలెండర్‌పై కాంగ్రెస్ సర్కార్‌కు బీజేవైఎం హెచ్చరిక

ధికారంలోకి రాగానే జాబ్ క్యాండర్ విడుదల చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగులను రోడ్డుపాలు చేశారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ విమర్శలు చేశారు.

Update: 2024-06-20 15:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారంలోకి రాగానే జాబ్ క్యాండర్ విడుదల చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగులను రోడ్డుపాలు చేశారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ విమర్శలు చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశధ్యంతో స్వచ్ఛందంగా నిరుద్యోగులంతా కలిసి ఇందిరా పార్క్ వద్ద గురువారం చేపట్టిన ధర్నాకు బీజేవేఐఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. బీజేవైఎం ఆధ్వర్యంలో కొన్నిరోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల శ్రేయస్సు కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రస్థాయిలో అన్ని కేంద్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆయన వెంట రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్, బీజేవైఎం నాయకులు తరుణ్, చిత్తరంజన్, అశోక్, సందీప్, అరవింద్, నితిన్, భారత్, మనోహర్, గోవర్ధన్, సిరివెన్నల, శశి తదితరులు ఉన్నారు.


Similar News